![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -67 లో....చందు తను ప్రేమించిన అమ్మాయి కన్పించడంతో తనని చూసి బాధపడుతుంటే దీరజ్ వచ్చి మాట్లాడతాడు. ఇన్నిరోజులు అయిన ఆ అమ్మాయిని మర్చిపోలేదంటే నువ్వు ఎంతగా తనని ప్రేమించావో అర్థమవుతుంది. నువ్వు బాధపడకు వెళ్ళమని చందుని రామరాజు వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు ధీరజ్. రామరాజు దగ్గరికి చందు వస్తాడు. కలశం తీసుకొని రాలేదంటుంటే ధీరజ్ వెళ్ళడని చందు చెప్తాను. వాడికి ఎందుకు చెప్పావ్.. వాడికి బాధ్యతలు తెలియవంటూ అతనిపై రామరాజు కోప్పడతాడు.
వాడు తీసుకొని వస్తాడంటూ చందు వేదవతి ఇద్దరు కలిసి ధీరజ్ గురించి మంచిగా చెప్తారు. మరోవైపు ధీరజ్ ని చంపడానికి రౌడీలతో మాట్లాడతాడు విశ్వ. ధీరజ్ కలశం తీసుకుంటాడు. ఇంకా వాడు రావట్లేదని రామరాజు కోప్పడతాడు. వస్తాడంటూ వేదవతి చెప్తుంది. పెద్ద పోటుగాడిలాగా అన్నింట్లో దూరేస్తాడని ధీరజ్ కి ప్రేమ ఫోన్ చేస్తుంది. రౌడీ అప్పుడే ధీరజ్ పై కత్తి విసురుతాడు. అప్పుడే ప్రేమ ఫోన్ చేయడంతో ధీరజ్ ఫోన్ కింద పడిపోతుంది అది పట్టుకుంటాడు. దాంతో రౌడీ విసిరిన కత్తి గురి తప్పుతుంది. ఈ దెయ్యం నాకు ఎందుకు ఫోన్ చేస్తుందని ధీరజ్ అనుకొని ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా వాడు రాలేదంటూ రామరాజు కోప్పడుతుంటే.. అప్పుడే ధీరజ్ కలశం తీసుకొని వస్తాడు.
ఏంటి నాకు ఫోన్ చేసావంటూ ప్రేమతో ధీరజ్ గొడవ పడుతుంటాడు. అది కామాక్షి చూసి అసలు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అంటూ వేదవతి వాళ్ళతో చెప్తుంది. వాళ్ళేం మాట్లాడకూతున్నారో నేను లిప్ సింక్ ద్వారా చెప్తానంటూ ప్రేమ, ధీరజ్ లు మాట్లాడుకునేది దూరం నుండి చెప్తాడు తిరుపతి. వాళ్ళు గొడవపడుతుంటే తిరుపతి ప్రేమగా మాట్లాడుకున్నట్లు చెప్తాడు. మరొకవైపు అందరు పోటీకి రెడీగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |